అలాంటి వాడే నా లైఫ్ పార్ట్‌నర్ అవుతాడు.. జాన్వీ కపూర్

by Manoj |
అలాంటి వాడే నా లైఫ్ పార్ట్‌నర్ అవుతాడు.. జాన్వీ కపూర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్, నటి జాన్వీ కపూర్ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది. తాజాగా ఆమె నటించిన 'గుడ్ లక్ జెర్రీ' జులై 29 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ మేరకు వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. లేటెస్ట్ ఇంటర్య్వూలో చేసుకోబోయేవాడిలో తనకు కావాల్సిన క్వాలిటీస్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించింది.

'అతను ప్రతిభావంతుడై ఉండాలి. ఏం చేసినా సరే సిన్సియర్‌గా చేయాలి. ఎల్లప్పుడూ నన్ను ఉత్సాహంగా ఉంచుతూ, కొత్తగా ఏదైనా నేర్చుకునేలా ప్రేరేపించాలి. అంతేకాదు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. అన్నింటికన్నా హాస్యం చాలా ముఖ్యం' అంటూ తన ఇష్టాలను బయటపెట్టింది జాన్వీ. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. మరో రెండు బిగ్ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed