బట్టలిప్పి చూపించడం గొప్ప కళాత్మక స్వేచ్ఛ.. స్టార్ నటి

by sudharani |
బట్టలిప్పి చూపించడం గొప్ప కళాత్మక స్వేచ్ఛ.. స్టార్ నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోకు సంబంధించి రోజురోజుకు సెలబ్రిటీల మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల నుంచి ఈ సపోర్ట్ రావడం నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇదే ఇష్యూపై తాజాగా స్పందించిన స్టార్ కిడ్ జాన్వీ కపూర్.. 'అది కళాత్మక స్వేచ్ఛ'గా భావిస్తున్నానని హీరోకు అండగా నిలిచింది. అంతేకాదు ప్రతిభను విమర్శించడం, విశ్లేషించడం సరైనది కాదన్న ఆమె.. ఈ సమయంలో అతనికి అండగా నిలబడటం కళాకారులుగా తమ బాధ్యతని చెప్పుకొచ్చింది. ఇక ఈ కాంట్రవర్సీ ఫొటో‌షూట్‌తో మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఎన్జీవో ఆఫీస్ బేరర్ చెంబూరు పోలీస్ స్టేషన్‌లో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ యంగ్ హీరోకు అలియా భట్, విద్యాబాలన్, దీపిక, కత్రినా వంటి స్టార్ యాక్ట్రెసెస్ సపోర్టుగా నిలబడటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed