- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌పై.. జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. దీంతో అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. గత రెండేండ్లుగా పీఎస్ఎల్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఫాల్కనర్ ఆడుతున్నాడు. అయితే తనకు చేయాల్సిన చెల్లింపుల ఒప్పందాన్ని పాక్ బోర్డు విస్మరించిందని, ఎన్నిసార్లు అడిగినా పదేపదే వాయిదా వేస్తూ వెళ్తున్నారని ఆసిస్ ఆటగాడు శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
అంతేకాకుండా అర్థాంతరంగా పీఎస్ఎల్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించాడు. వెళ్లే ముందు పాక్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే, జేమ్స్ ఫాల్కనర్ ఆరోపణలను తొలుత పీసీబీ ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేసింది. అతనికి చేయాల్సిన చెల్లింపులన్నీ క్లియర్‌గా ఉన్నాయని వెల్లడించింది.ఫాల్కనర్ కావాలనే పీసీబీ పరువు తీసేందుకు యత్నించాడని, హోటల్ ఆస్తిని పాడు చేయడంతో పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులతోనూ అనుచితంగా ప్రవర్తించాడని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఫాల్కనర్ పై జీవితకాలం నిషేధం విధించినట్టు పీసీబీ బోర్డు స్పష్టం చేసింది.