Dolo 650: డోలో650 తయారీ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు!

by S Gopi |   ( Updated:2022-07-06 13:53:44.0  )
IT Conducts Raids at manufactures of Dolo 650 Micro Labs in Bengaluru
X

బెంగళూరు: IT Conducts Raids at manufactures of Dolo 650 Micro Labs in Bengaluru| భారత్‌లోని చాలామంది జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులకు విరివిగా వాడే ప్రముఖ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగానే ఈ సోదాలు జరిపినట్టు, ఈ వ్యవహారానికి సంబంధించి కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలు బెంగళూరు, ఢిల్లీ సహా తమిళనాడు, గోవా, పంజాబ్‌తో పాటు దేశంలోని మొత్తం 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

ఇందుకోసం మొత్తం 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా మైక్రో ల్యాబ్స్ డైరెక్టర్ ఆనంద్ సురానా, సీఎండీ దిలీప్ సురానా ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఇందులో కీలక డాక్యుమెంట్లను అధికారులు సేకరించారని తెలుస్తోంది. 2020లో కొవిడ్-19 మహమ్మారి తర్వాత కంపెనీ భారీ స్థాయిలో 350 కోట్లకు పైగా మాత్రలను విక్రయించింది. అలాగే, 2021 ఏడాదిలో ఏకంగా రూ. 400 కోట్ల టర్నోవర్‌ను సాధించడం విశేషం. డోలో650 మాత్ర అమ్మకాలు మిగిలిన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

Also Read: డోలో 650' తో ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్

Advertisement

Next Story

Most Viewed