మరో కొత్త వైరస్.......

by Harish |   ( Updated:2022-03-18 06:31:13.0  )
మరో కొత్త వైరస్.......
X

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి కేసుల వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో మరో కొత్త వైరస్‌ను గుర్తించినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. ఈ వేరియంట్ కొవిడ్ -19 వైరస్ ఒమిక్రాన్ వెర్షన్‌లోని రెండు ఉప వేరియంట్‌ బీఎ1, బీఎ2 లను కలిగి ఉందని వెల్లడైంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్‌లను కలిపే 'డెల్టాక్రాన్‌' లాగా రెండు వేరియంట్‌లను మిళితం చేసే కొవిడ్ హైబ్రిడ్ వెర్షన్‌లను ఇంతకు ముందు కూడా కనుగొనబడ్డాయని ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఈ కొత్త వైరస్ కోసం ప్రత్యేకంగా వైద్యం అవసరం లేదని, దీని బారిన పడిన వారు తేలికపాటి జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనతతో బాధపడుతున్నారని తేలింది. ఇజ్రాయిల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఈ కొత్త వేరియంట్ కనుగొనబడింది. దీనిపై కొవిడ్ రెస్పాన్స్ హెడ్ సల్మాన్ జర్కా స్పందిస్తూ.. ఈ కొత్త వైరస్ తీవ్రమైన వ్యాప్తికి కారణం అవుతుందని మేము ఆందోళన చెందడం లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story