ఆ హీరోయిన్‌తో నా కొడుకు లవ్‌లో ఉన్నాడు.. హీరో తల్లి

by Harish |
ఆ హీరోయిన్‌తో నా కొడుకు లవ్‌లో ఉన్నాడు.. హీరో తల్లి
X

దిశ, సినిమా : ఇషాన్ ఖట్టర్-అనన్యా పాండే మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని బాలీవుడ్ టాక్. ఈ విషయాన్ని అనన్య కూడా పరోక్షంగా ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇషాన్ తల్లి నీలిమా అజీజ్.. తన కొడుకు లైఫ్‌లో అనన్య ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పుకొచ్చింది. పెద్ద కొడుకు షాహిద్ కపూర్, కోడలు మీరా రాజ్‌పుత్‌‌లకు మంచి ఫ్రెండ్ కూడా అని తెలిపింది. తమ ఫ్యామిలీ సర్కిల్‌లో భాగం అయిపోయిందన్న నీలిమ.. ఇషాన్‌-అనన్యను గ్రేడ్ బడ్డీస్‌గా వర్ణించింది. తన ఫ్రెండ్స్‌తో కూడా ఈజీగా కలిసిపోతుందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అంతేకాదు 'గ్రెహాయియా'లో అనన్య యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రశంసలు కురిపించిన ఆమె.. సినిమా సినిమాకు మరింత మెరుగవుతుందని, రియలిస్టిక్ అండ్ ఇంటెలిజెంట్ పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకోవడం హ్యాపీగా ఉందని చెప్పింది.

Advertisement

Next Story