Devara Movie: 'దేవర' పార్ట్-3 కూడా ఉందా.. క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

by Prasanna |
Devara Movie: దేవర పార్ట్-3 కూడా ఉందా.. క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ
X

దిశ, వెబ్ డెస్క్ : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరెకెక్కిన మూవీ 'దేవర'. ఈ మూవీ ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చి ఎవరూ ఊహించలేని హిట్ ను అందుకుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా క్యాష్ చేసుకుంది. ఈ మూవీ పది రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ సక్సెస్ ను అటు మూవీ టీమ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

'దేవర' సినిమా చూసిన వారికీ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి సమాధానాలు పార్ట్-2 లో ఉండనున్నాయని కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, 'దేవర' మూవీ ప్రాంఛైజీగా రాబోతుందని, ఈ సినిమాకి పార్ట్ 2 కాకుండా పార్ట్ - 3 కూడా ఉంటుందంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా, డైరెక్టర్ కొరటాల శివ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.

" దేవర చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాలో వచ్చే క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా తీసేలా చేశాయి. సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఇప్పటికే షూట్ చేసాం. మిగిలిన భాగాన్ని త్వరలోనే కంప్లిట్ చేస్తాం.. పార్ట్ 3 ఉండదంటూ" ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed