మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎవరూ కలిగి ఉండొద్దు.. DGGI హెచ్చరిక

by Gantepaka Srikanth |
మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎవరూ కలిగి ఉండొద్దు.. DGGI హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ మనీ గేమింగ్ వెబ్‌సైట్‌లపై డీజీజీఐ(Directorate General of GST) కొరడా ఝలిపించింది. తాజాగా అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లు సీజ్ చేసింది. అంతేకాదు.. సదరు గేమింగ్ కంపెనీలకు చెందిన రూ.126 కోట్లు కూడా ఫ్రీజ్ చేసింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌(Money Gaming Websites)ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతను డీజీజీఐ(DGGI) హెచ్చరించింది. ఇక నుంచి ఎవరూ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కలిగి ఉండొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో కొందరు అక్రమార్కులు ఎగవేతలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎక్కువగా ఆన్‌లైన్‌ గేమింగ్‌(Online Gaming) విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని ఇటీవల డీజీజీఐ(DGGI) వార్షిక నివేదికలో వెలువరించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసే ప్రముఖులపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 15 మందిపై కేసు నమోదు కాగా, ఒక్కొక్కరుగా విచారణకు హాజరు అవుతున్నారు. తాజాగా నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో మరో ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Next Story