ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆ హీరోయిన్‌కు తెలియాల్సిందేనా?

by sudharani |
ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆ హీరోయిన్‌కు తెలియాల్సిందేనా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు గాసిప్ మినిస్ట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు కరణ్ జోహార్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన కరణ్.. ఉదయాన్నే లేవగానే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, స్టైలిస్ట్స్, మేకప్ మెన్.. ఇలా అన్ని విభాగాల వారికి ఫోన్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. వారి నుంచి ఏదైనా గాసిప్ వచ్చిందంటే.. ఆ విషయాన్ని క్లారిఫై చేసుకునేందుకు వెంటనే తనకు కాల్ చేస్తుందని వివరించాడు. మొత్తానికి ఇండస్ట్రీలో ఏ హీరోహీరోయిన్ ఎక్కడున్నారు? ఎవరు ఎవరిని మీట్ అవుతున్నారు? ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? అనే ఇన్ఫర్మేషన్ కచ్చితంగా తన దగ్గర ఉంటుందని చెప్పాడు కరణ్. ఇక ఈ వివరణను హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడం విశేషం.

Advertisement

Next Story