- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయన్ను తిట్టినందుకే జగ్గారెడ్డి సస్పెన్షన్..!?
దిశ ప్రతినిధి, సంగారెడ్డి : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఒంటికాలిపై లేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆటలు కట్టించేందుకు ఏఐసీసీ అధిష్టానం సిద్దమైంది. ఉన్నపళంగా జగ్గారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ సస్పెన్షన్‌తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పలువురు సీనియర్ల నోళ్లకు తాళం వేయాలని అధిష్టానం భావిస్తున్నది. జగ్గారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పార్టీ నేతలకు సమాచారం అందించింది. అయితే నేటి సాయంత్రంలోగా సస్పెన్షన్ ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే ఆయన్ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం అయినప్పటి నుంచి జగ్గారెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో రేవంత్‌రెడ్డి పాల్గొనగా.. తనకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని బహిరంగంగా రేవంత్‌పై జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశాలకు కూడా జగ్గారెడ్డి హాజరు కాలేకపోయారు.
ఇదిలా ఉండగా కలిసి పని చేద్దామని రేవంత్‌రెడ్డి తనతో ఎప్పుడు అనలేదని, ఆయన వ్యవహారం నచ్చలేదని ఇటీవల జగ్గారెడ్డి మీడియా ఎదుట విమర్శలు చేశారు. పార్టీ అధినేత్రి సోనియాను తిట్టిన వారికి పీసీసీ సీట్లో కూర్చోబెట్టారని, పార్టీ కోసం పనిచేస్తున్న తమలాంటి వారిపై వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన చెందారు.
తన పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే..
సస్పెండ్ చేస్తారా..? ఏ విధంగా చేస్తారో అదీ చూస్తాను అని కూడా హెచ్చరించారు. అవకాశం వచ్చిన ప్రతి చోట జగ్గారెడ్డి రేవంత్ వ్యవహారాన్ని తప్పుపడుతూ వస్తున్నారు. తన పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే అని కూడా చెప్పకొచ్చారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్న అధిష్టానం వివిధ రకాలుగా వాస్తవ సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలిసింది.
పలువురి నుంచి అభిప్రాయాలు సేకరించి చివరకు జగ్గారెడ్డిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ వర్గాల్లో జగ్గారెడ్డి సస్పెన్షన్ కానున్నట్లు హాట్ హాట్‌గా చర్చలు కొనసాగుతున్నాయి. కాగా సస్పెన్షన్ ఆదేశాలు వచ్చిన తర్వాత జగ్గారెడ్డి ఏ విధంగా స్పందించనున్నారో చూడాల్సిన ఉంది. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గంపై దృష్టి సారించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.