- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగాది పచ్చడిలో వేప వేస్తున్నారా.. వేప చెట్లకు సోకిన తెగులుతో ఎంత శ్రేయస్కరం?
దిశ, డైనమిక్ బ్యూరో: ఉగాది పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఇందులో ముఖ్యమైన చేదు రుచి చూపించేందుకు వేపపూతను పచ్చడిలో వేస్తుంటారు. అయితే, గతకొన్ని నెలలుగా వేప చెట్లకు తెగులు రావడం.. చెట్లన్ని ఎండిపోవడం చూసి ఏమైందో తెలియక ప్రజలందరూ ఆందోళన చెందారు. ఈ క్రమంలో వేపపూతను ఈసారి తినాలా? వద్దా? అని, ఆరోగ్యదాయకమేనా అని చాలామంది సందేహంలో పడిపోయారు.
ఈ సందర్భంగా ప్రజల్లో నెలకొన్న అనుమానాన్ని తొలగించే విధంగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ కీలక విషయం వెల్లడించారు. వేపచెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమని, అది వేపపూతలో ఏమీ లేదని నిరభ్యంతరంగా తినొచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేగాకుండా, వేపపూత తెగులుపై గత ఆరు నెలలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని, తెగులు సోకిన చెట్ల పూత తింటే ఏమవుతుందోనన్న భయాన్ని పక్కన పెట్టాలని తెలిపారు. అంతేగాకుండా, ఇళ్ల వద్ద ఉన్న వేప చెట్లకు నీరు పోసి కాపాడాలని కోరారు.
మంత్రి KTR తో బెట్ కట్టిన నెటిజన్.. అది నిజమైతే రూ.1 లక్ష ఇచ్చేందుకు సిద్ధం