సామ్ కోసం చైతు స్పెషల్ డైలాగ్.. హార్ట్ టచింగ్..

by S Gopi |   ( Updated:2022-07-14 10:28:55.0  )
సామ్ కోసం చైతు స్పెషల్ డైలాగ్.. హార్ట్ టచింగ్..
X

దిశ, సినిమా : అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకుల టాపిక్ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.ఇద్దరు కూడా వేర్వేరు దారులు ఎంచుకున్నప్పటికీ.. అభిమానులు మాత్రం మళ్లీ ఒక్కటైతే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో చైతు లేటెస్ట్ ఫిల్మ్ 'థాంక్ యూ' మూవీ డైలాగ్ కూడా వైరల్ టాపిక్ అయిపోయింది. లైఫ్‌ జర్నీలో కొన్ని రిలేషన్స్ మన ఎదుగుదలకు కారణమవుతాయనేది సినిమా కథ కాగా.. 'ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది' అనే డైలాగ్‌పై నెట్టింట డిస్కషన్ జరుగుతోంది. చై-సామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ డైలాగ్ రాశారని సందేహిస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ట్రైలర్ చూడాలని సమంతను ట్యాగ్ చేస్తుండటం విశేషం.

Advertisement

Next Story