- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ షురూ..!
న్యూఢిల్లీ : మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్-15 ప్రారంభకానుండగా.. తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. లీగ్ ప్రారంభ వేడుకలను నిర్వహించకూడదని బోర్డు భావిస్తున్నది. అయితే, ఆరంభ వేడుకలను నిర్వహించకపోవడం ఇది తొలిసారి కాదు. చివరి సారిగా 2018 లో నిర్వహించారు. అనంతరం 2019లో ఆరంభ వేడుకులకు వెచ్చించే డబ్బును పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేశారు. ఆ తర్వాత, 2020, 2021 లో కరోనా కారణంగా ఆరంభ వేడుకలు నిర్వహించలేదు.
అయితే, ఇటీవల దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ..చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కోవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు లేకుండానే లీగ్ ప్రారంభించాలని భావిస్తున్నది. కాగా, ఈ నెల 26న ఐపీఎల్ షురూ కానుండగా.. వాఖండే వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.