అతడికి మీ కంటే నేనే బిగ్ ఫ్యాన్.. ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చిన సెహ్వాగ్

by Vinod kumar |   ( Updated:2022-04-07 16:35:34.0  )
అతడికి మీ కంటే నేనే బిగ్ ఫ్యాన్.. ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చిన సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తనను టార్గెట్ చేస్తున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ బ్యాటింగ్‌కు తాను పెద్ద అభిమానిని తెలిపారు. సదుద్దేశంతోనే 'వడపావ్' అనే పదాన్ని వాడనని, హిట్‌మ్యాన్‌ను అవమానించాలని కాదని స్పష్టం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్ ప్యాట్ కమిన్స్ సునామీ ఇన్నింగ్స్‌తో.. గెలిచే మ్యాచ్‌‌ను ముంబై జట్టు చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం.

ఈ ఫలితాన్ని ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో తన ట్వట్టర్‌లో చమత్కారంతో కూడిన ట్వీట్ చేశాడు. 'నోటీకాడి వడ పావ్‌ను లాగేసుకున్నట్లు ప్యాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రోహిత్ అభిమానులు సిరీయస్ అయ్యారు. ఈ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న హిట్ మ్యాన్ అభిమానులు సెహ్వాగ్‌పై ట్రోలింగ్ దిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన క్రికెటర్‌ను అవమానిస్తావా? అంటూ మండిపడ్డారు. దీంతో తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుసుకున్న సెహ్వాగ్.. రోహిత్ అభిమానులకు మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. 'వడా పావ్ అనేది ముంబై నగరానికి రిఫరెన్స్. అక్కడ అది చాలా ఫేమస్. రోహిత్ ఫ్యాన్స్ కూల్‌గా ఉండండి. నేను మీకంటే హిట్ మ్యాన్ బ్యాట్‌కు పెద్ద అభిమానిని.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.


Advertisement

Next Story