- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పులతో మండపంలోకి.. బ్రహ్మాస్త్ర' మూవీ వివాదంపై స్పందించిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, అలియా జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'.ఈ మూవీని బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ భారీ బడ్జెట్‌తో మూడు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందులోని ఓ సీన్ వివాదానికి దారి తీసింది. ట్రైలర్ లో హీరో ఒక గుడికి షూస్ వేసుకొని లోపలికి వెళ్తూ గంట కొడతాడు. దీంతో షూస్ తో గుడిలోకి ఎవరైనా వెళ్తారా అంటూ ఈ మూవీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
తాజాగా, ఆ వివాదం పై అయాన్ ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ఇలా రాశారు''ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని వెళ్ళింది ఆలయంలోకి కాదు, దుర్గాదేవి పూజామండపంలోకి. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గాదేవి పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం బట్టి మేము మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం చెప్పులు తీసేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగిందిదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమా తీశాం. అంతే కానీ ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు''అంటూ చెప్పుకొచ్చాడు.