ఏపీ నుంచి పూణేకు గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్

by srinivas |
ఏపీ నుంచి పూణేకు గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు గంజాయి, డ్రగ్స్‌, నేరాల నియంత్రణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కడ గంజాయి సాగు చేసినా పట్టుకుంటున్నారు. ఎక్కడ నేరాలకు ప్రయత్నించినా కళ్లెం వేస్తున్నారు. డ్రోన్ ఇచ్చిన సమాచారంతో అటు మందుబాబుల అడ్డాల గుట్టును రట్టు చేస్తున్నారు. అయితే గంజాయి అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రభుత్వ నిఘాను యదేచ్ఛగా బేఖాతరు చేస్తున్నారు. తాజాగా పోలీసులు చేసిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.

గురువారం మధ్యాహ్న సమయంలో ఏపీ, తెలంగాణ బోర్డర్‌(AP and Telangana Border)లో పోలీసులు వాహన తనిఖీలు(Vehicle inspections) చేశారు. భద్రచలం సమీపంలో కారులో తరలిస్తున్న 210 కేజీల గంజాయి(Marijuana)ని పట్టుకున్నారు. ఇద్దరు దుండగులను అరెస్ట్ చేశారు. కారుతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేశారు. గంజాయి విలువ రూ. 53 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed