- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gang Rape: అంబులెన్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మధ్యప్రదేశ్‌లో దారుణం
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని మౌగంజ్(Mouganz) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న అంబులెన్స్(Ambulance)లో ఇద్దరు వ్యక్తులు 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నవంబర్ 25న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి బలవంతంగా జననీ ఎక్స్ ప్రెస్ అంబులెన్స్‌లో ఎక్కించారు. ఈ క్రమంలోనే చంపుతామని బెదిరించి ఆమెపై అంబులెన్స్‌లోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికను తన స్వగ్రామంలో వదిలి వెళ్లి పోయారు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతని స్నేహితుడు రాజేష్ కేవత్‌లను గురువారం అరెస్ట్ చేశారు. నిందితులను నైగర్హి నివాసితులుగా గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా లైంగిక దాడి జరిగినట్టు డాక్టర్లు నిర్ధారించినట్టు ఎస్పీ సర్నా ఠాకూర్ తెలిపారు.
యూపీలో నర్సుపై గ్యాంగ్ రేప్!
ఉత్తరప్రదేశ్ (Utharapradesh)లోని జలౌన్(Jaloun)లోనూ ఒక నర్సుపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చుర్ఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తు్న్న మహిళ గురువారం ఉదయం డ్యూటీకి వెళ్తుండగా.. కొంత మంది వ్యక్తులు ఆమెను అడ్డుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అంతేగాక మహిళను కర్రతో కొట్టారని, ప్రయివేట్ పార్ట్స్‌లో కారంపొడి చొప్పించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.