Balakrishna: అగ్ర నటుడు బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కేవలం ఆయన కోసమేనంటూ..!

by Anjali |   ( Updated:2024-10-13 04:11:48.0  )
Balakrishna: అగ్ర నటుడు బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కేవలం ఆయన కోసమేనంటూ..!
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు బాలకృష్ణ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికి సినిమాల్లో కీలక రోల్ పోషిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన డ్యాన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే హీరో బాలయ్య తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓటీటీ వేదిక టాక్ షో అన్ స్టాపబుల్ ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ షో సీజన్ -4 కు కూడా సిద్ధమైంది.

దసరా పండుగ సందర్భంగా టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్-4 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు. దసరా అంటేనే అమ్మవారని, విజయం అనేది మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. మనం ఏదైనా కొత్తగా ఆలోచించాలని, అటోమేటిక్‌గా జయం మనల్ని వరిస్తుందని తెలిపారు. నాన్న నందమూరి తారకరామారావే దీనికి ప్రతీక అని బాలయ్య తండ్రిని గుర్తుచేసుకున్నారు. ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని వెల్లడించారు. టాక్ షో అన్‌స్టాపబుల్ కు వ్యాఖ్యతగా మారానంటే ఆయన స్ఫూర్తితోనే అని అన్నారు. అలాగే ఈ షోకు నేను వ్యాఖ్యాతగా ఒప్పుకున్నానంటే దానికి కారణం అరవింద్ అని తెలిపారు. వేరే ఎవరు అడిగినా బాలయ్య అంగీకరించకపోయేవారని వివరించారు. ప్రస్తుతం హీర్ బాలయ్య కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

Advertisement

Next Story