- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్మనీ అతిపెద్ద డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్!
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ జర్మనీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్, కమర్షియల్ ఏజెన్సీ ఓడి టీని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కొనుగోలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ 50 మిలియన్ యూరో(దాదాపు రూ. 420 కోట్ల)కు వెచ్చించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఓడిటీ కంపెనీని సొంతం చేసుకోవడం ద్వార బ్రాండింగ్, సృజన, ఎక్స్‌పీరియన్స్ డిజైన్ సామర్థ్యాలను మరింత బలోపేతం అవుతాయని ఇన్ఫోసిస్ భావిస్తోంది. కంపెనీని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియం వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పూర్తవుతుందని వెల్లడించింది.
ఓడిటీ జర్మనీలోనే అతిపెద్ద స్వతంత్ర డిజిటల్ మార్కెటింగ్ కంపెనీగా ఉంది. దీనికి బెర్లిన్, షాంఘై, స్టట్‌గార్ట్, బెల్‌గ్రెడ్, తైపీ లాంటి నగరల్లో 300కి పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 21.6 మిలియన్ యూరోల ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఓడిటీ ప్రముఖ ఈ-కామర్స్ రిటైల్, ఎఫ్ఎంసీజీ బ్రాండ్, గ్లోబల్ మొబిలిటీ కంపెనీలకు డిజిటల్ పరిష్కారాలు వంటి సర్వీసులను అందిస్తోంది.