- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ది కశ్మీర్ ఫైల్స్' పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది: ఇందిరా శోభన్
దిశ, తెలంగాణ బ్యూరో: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆప్ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ ఇంటిపై పట్టపగలు దాడి చేసి, హత్యకు కుట్ర చేశారని, బీజేపీ ఎంపీ, కార్యకర్తలపై రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి చెందిన ఢిల్లీ పోలీసుల సంపూర్ణ సహకారంతోనే ఈ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. దేశ రాజధానిలో ఒక సీఎంకు భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసినందుకు దాడి చేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ ప్రజల మధ్య నిత్యం మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారని, బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.