- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వల్పంగా పెరిగిన తయారీ పీఎంఐ!
దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరిలో దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాలు స్వల్పంగా పెరిగాయి. తయారీ సంస్థలు ఉత్పత్తితో పాటు భారీ స్థాయిలో కొత్త ఆర్డర్లు అందుకున్నాయని, దీనికి తోడు డిమాండ్ అనుకూల పరిస్థితుల వల్ల కార్యకలాపాలు పుంజుకున్నాయని ఐహెచ్‌ఎస్ మార్కిట్ నెలవారీ సర్వే బుధవారం ఓ ప్రకటనలొ వెల్లడించింది. జనవరిలో 54 పాయింట్లుగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) గత నెల 54.9కి పెరిగింది. ఈ వృద్ధి తయారీ రంగంలో బలమైన పునరుద్ధరణను, ముఖ్యంగా పీఎంఐ డేటా వరుసగా ఎనిమిదో నెలలో తయారీ రంగ నిర్వహణ మెరుగుదలను సూచిస్తుందని ఐహెచ్‌ఎస్ మార్కెట్ ప్రతినిధి లిమా తెలిపారు. పీఎంఐ సూచీ 50 కంటే పైన నమోదైతే వృద్ధి సాధించినట్లు, 50కి తక్కువగా నమోదైతే క్షీణతగాను పరిగణిస్తారు. స్థిరమైన అమ్మకాల వృద్ధి సమీక్షించిన నెలలో తయారీ రంగం ఉత్పత్తిలో పెరుగుదలకు మద్దతిచ్చింది. అంతేకాకుండా పరిశ్రమల ఉత్పత్తి, ఇన్‌పుట్ కొనుగోల్లు, కొత్త ఆర్డర్లతో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో వనరుల కొరత వల్ల ఉత్పత్తి సామర్థ్యం పై ఒత్తిడి ఉందని ఐహెచ్ఎస్ మార్కెట్ తెలిపింది. ఇక, ఉపాధి తక్కువగానే ఉందని, ముడి సరుకులు, సెమీ ఫినిష్‌డ్ వస్తువుల ధరలు పెరగడంతో ప్రతికూలత ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పై ఒత్తిడి కొనసాగితే రానున్న నెలల్లో ఉపాధి మరింత తగ్గే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కెట్ వెల్లడించింది.