ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను తగ్గించిన ప్రభుత్వం!

by Disha Desk |
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను తగ్గించిన ప్రభుత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 8.9 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22 లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 5.4 శాతం వృద్ధి సాధించిందని, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 0.7 శాతం ఎక్కువగానే నమోదైనట్టు జాతీయ గణాంకల కార్యాలయం వెల్లడించింది. అయితే, గత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. తయారీతో పాటు పెట్టుబడులు తగ్గడం వంటి అంశాలు సమీక్షించిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి నెమ్మదించడానికి కారణమని గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన గణాంకాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం దేశ జీడీపీ అంచనాను 9.2 శాతంగా అభిప్రాయపడింది. అయితే, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దీన్ని 8.9 శాతానికి అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఇక, బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రికార్డు స్థాయిలో 20.3 శాతం నమోదైన సంగతి తెలిసిందే. రెండో త్రైమాసికంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది.

Advertisement

Next Story