- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యధిక క్షీణతకు ఇండియా ఫారెక్స్ నిల్వలు..
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు మార్చి 11 తో ముగిసిన వారంలో 9.646 బిలియన్ డాలర్లు క్షీణించి 622.275 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది దాదాపు రెండేళ్లలో అత్యధిక క్షీణత, రూపాయి విలువ పతనాన్ని నిరోధించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా డాలర్లను విక్రయించింది. RBI గణాంకాల ప్రకారం, ఫారెక్స్ నిల్వలలో అతిపెద్ద భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షిస్తున్న వారంలో $11.108 బిలియన్లు తగ్గి $554.359 బిలియన్లకు చేరుకున్నాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, డాలర్‌లను విక్రయించడం ద్వారా ఆర్‌బిఐ కరెన్సీ మార్కెట్లలో జోక్యం చేసుకుంది. భారతీయ కరెన్సీలో మరింత బలహీనతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ వారంలో రోజుకు $1 బిలియన్లను విక్రయించినట్లు అంచనా వేయబడింది. ఈ ఏడాది మార్చి 11 తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వల్లో క్షీణత దాదాపు రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉంది. దేశ ఫారెక్స్ నిల్వలు 11.9 బిలియన్ డాలర్ల మేర పడిపోయాయి. మార్చి 11తో ముగిసిన వారంలో ఐఎంఎఫ్‌లో భారతదేశ రిజర్వ్ స్థానం 7 మిలియన్ డాలర్లు తగ్గి 5.146 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడించాయి.