- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మెటావర్స్‌లో 'కార్ల' షోరూం ప్రారంభించిన ఇండియన్ స్టార్టప్.!
దిశ, ఫీచర్స్ : వీఆర్-ఆధారిత ఆటో టెక్ సంస్థ కార్జ్‌సో(CarzSo) మెటావర్స్‌లో భారతదేశపు మొట్టమొదటి యూజ్డ్ కార్స్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఇకపై తమ యూజర్స్ మెటావర్స్‌లో ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయవచ్చని, వివిధ రకాలైన మోడల్స్ నుంచి కార్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
మెటావర్స్‌ను ప్రారంభించేందుకు తమ కంపెనీ NFT-బేస్డ్ ల్యాండ్ నిర్మించనున్నట్లు కార్జ్‌సో ప్రకటించింది. ఈ ఆటో టెక్ స్టార్టప్‌తో రిటైల్ ఆటో రంగాన్ని మెటావర్స్ స్పేస్‌కు తీసుకెళ్లిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా అవతరించాలని యోచిస్తోంది. అంతేకాదు ఈ కాన్సెప్ట్ చుట్టూ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. కొనుగోలుదారులు, యజమానులు వారి వాహనాల వర్చువల్ ఆస్తులను (NFTలు) సృష్టించేందుకు లేదా ముద్రించేందుకు వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో వాహన యజమానులు, వారి వాహనాలకు ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అందించనుంది కంపెనీ. దీంతో వాహన యజమానులు.. వారి వెహికిల్ నంబర్ ప్లేట్స్‌కు సంబంధించిన NFTలను కూడా సృష్టించగలరని, వాటిని తర్వాత అమ్ముకోవచ్చని కార్జ్‌సో పేర్కొంది. అంతేకాదు తమ ప్లాట్‌ఫామ్‌లోని సెర్చింగ్ టూల్స్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన మోడల్, ప్రైస్ రేంజ్, బాడీ టైప్ ఎంచుకోవచ్చని వెల్లడించింది. కార్లను కొనుగోలు చేసేందుకు విక్రయించడానికి ఇప్పటికే వర్చువల్ షోరూమ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్న కార్జ్‌సో.. తమ కస్టమర్స్ షోరూమ్ సందర్శనకు, వర్చువల్‌గా కార్ల కొనుగోలుకు వీలు కల్పిస్తుంది.
భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ, వర్చువల్ షోరూమ్ ఆధారిత ఆటో టెక్ కంపెనీ అయినందున, మెటావర్స్‌ను మరింత త్వరగా ఆవిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. మెటా ల్యాండ్‌లో డీల్ చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటో ఇండస్ట్రీ ఫోకస్డ్ వెబ్ 3.0 కంపెనీగా ఎట్టకేలకు మా విజన్‌ని రియాలిటీగా మార్చుకోగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము
- వైభవ్ శర్మ, ఫౌండర్, సీఈవో