ఆశించిన దానికంటే మెరుగ్గా భారత వృద్ధి రేటు: ఆర్థికవేత్త అషిమా గోయల్!

by Manoj |
ఆశించిన దానికంటే మెరుగ్గా భారత వృద్ధి రేటు: ఆర్థికవేత్త అషిమా గోయల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నుంచి భారత ఆర్థికవ్యవస్థ సానుకూల పునరుద్ధరణను సాధిస్తోందని, ఆశించిన దానికంటే వృద్ధి రేటు మెరుగ్గా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యులైన అషిమా గోయల్ అన్నారు. అయితే, రికార్డు స్థాయిలో పెరుగుతున్న ముడి చమురు ధరలు కొంత ఆందోళన కలిగించే అంశమని ఆమె అన్నారు. భారత్ సంస్కరణల కొనసాగింపుతో పాటు ఆర్థిక విధానాలు వృద్ధి పురోగతిని సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

గత నెలాఖరు నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం వల్ల రికవరీ కొనసాగినప్పటికీ ముడి చమురు ధరలు వృద్ధిపై ప్రభావం చూపించవచ్చన్నారు. అయితే సంక్షోభ పరిస్థితుల్లో ఈ పెరుగుదల ధోరణి తాత్కాలికమేనని, దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడకుండా భారత్ దీర్ఘకాలంలో గ్రీన్ ఎనర్జీ వైపుగా మారేందుకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు యుద్ధం వల్ల వంటనూనె, ముడి చమురు ధరల పెరుగుదల మరి కొన్ని నెలల పాటు కొనసాగితే ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనాను పెంచే అవకాశం ఉందని అషిమా గోయల్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed