బేబీ గెలాక్సీని కనుగొన్న భారత ఖగోళ పరిశోధకులు

by Harish |
బేబీ గెలాక్సీని కనుగొన్న భారత ఖగోళ పరిశోధకులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడిప్పుడే నక్షత్రాలు ఆవిర్బవిస్తున్న సరికొత్త బేబీ గెలాక్సీని భారతీయ ఖగోళ పరిశోధకులు ఆవిష్కరించారు. మన పొరుగునే అతిపెద్ద ప్రకాశవంతమైన గెలాక్సీ వెనుక దాగి ఉన్న ఈ శైశవ నక్షత్ర మండలం ఇంతవరకు ఎవరికంటా పడలేదు. అంతరిక్షంలో కేవలం 136 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ కనీకనిపించని దెయ్యంలాగా దాక్కుని ఉన్నట్లు వీరు చెప్పారు. ఈ గెలాక్సీలో ఇప్పటికీ నక్షత్రాలు కొత్తగా ఏర్పడుతున్నాయని చెప్పారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్‌కి చెందిన పరిశోధకుల బృందం ఈ అరుదైన గెలాక్సీ జాడను పసిగట్టింది. అంతర్జాతీయ పరిశోధకులు కూడా ఈ కృషిలో పాలు పంచుకున్నారు. భారత్ నుంచి జ్యోతి యాదవ్, మౌసమి దాస్, సుధాన్సు బార్వే, కాలేజ్ డి ఫ్రాన్స్‌కి చెందిన ఫ్రాంకోయిస్ కోంబస్ ఈ పరిశోధనలో కీలక పాత్ర వహించారు.

((ఇలాంటి శైశవ గెలాక్సీలు విశ్వం మొత్తం ద్రవ్యరాశిలో 15 శాతాన్ని కలిగి ఉంటాయని వీరు చెప్పారు. గతంలో మనకు తెలిసిన గెలాక్సీ 825 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉండగా, ఈ కొత్త గెలాక్సీ కేవలం 136 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్నట్లు వీరు కనుగొన్నారు)).

Advertisement

Next Story