అంతర్జాతీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన ఫెసిలిటీ ప్రారంభం

by Vinod kumar |
అంతర్జాతీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన ఫెసిలిటీ ప్రారంభం
X

దిశ, శంషాబాద్: జీఎంఆర్ ఎయిర్ కార్గో.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ యొక్క విభాగం జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సోమవారం అంతర్జాతీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ కార్గో సరుకుల నిర్వహణ కోసం కొత్త ఫెసిలిటీని ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నుండి ఆధునిక, ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్‌ను కలిగి ఉంది. కార్గో, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించడంతో అలాంటి సరుకులను నిర్వహణ కోసం కస్టమ్స్ అధికారులచే ఆమోదించబడిన, ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ ఫెసిలిటీ ఆవశ్యకత ఏర్పడింది.


హైదరాబాద్ కస్టమ్స్ వారి క్రియాశీల మార్గదర్శకత్వం మరియు మద్దతుతో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఈ కొత్త ఫెసిలిటీని అభివృద్ధి చేసి కార్యరూపంలోకి తెచ్చింది. ఈ కొత్త ఫెసిలిటీని సోమవారం కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బి.వి. శివ నాగ కుమారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ జీఎంఆర్ ఎస్‌జికె కిశోర్, ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్, జీఎంఆర్ కార్గో సీఈవో సౌరభ్ కుమార్ సమక్షంలో ప్రారంభించారు.


జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ ప్రాంగణంలో ఉన్న ఈ ఫెసిలిటీ కొరియర్ కార్గో షిప్‌మెంట్‌ల ఎగుమతి, దిగుమతులకు కొత్త గేట్‌వేగా మారనుంది. ఈ కొత్త ఫెసిలిటీ ఇండియన్ కస్టమ్స్ యొక్క ఎక్స్‌ప్రెస్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ తో అనుసంధానించబడింది. దీని వల్ల టెర్మినల్ వద్ద కొరియర్ కన్సైన్‌మెంట్ ప్రాసెసింగ్, క్లియరెన్స్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా, తొందరగా జరుగుతాయి. ఈ ఫెసిలిటీ అధునాతన భద్రతా స్క్రీనింగ్ మరియు కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని సహాయ మౌలిక సదుపాయాలు, పరికరాలతో అనుసంధానమైంది.

Advertisement

Next Story

Most Viewed