పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం.. గంటలతరబడి నిల్చోని ఇద్దరు మృతి

by Manoj |
పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం.. గంటలతరబడి నిల్చోని ఇద్దరు మృతి
X

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతుంది. నిత్యావసరాల ధరలు పెరిగి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణంతో ఇంధన రేట్లు పెరగడం, మరోవైపు లభ్యత తగ్గిపోవడంతో నానా ఆగచాట్లు పడుతున్నారు. ఆదివారం పెట్రోల్ కోసం లైన్లో నిల్చోని ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాదాపు నాలుగు గంటల పాటు లైన్లో నిల్చోవడంతో చనిపోయారని పోలీస్ అధికారి తెలిపారు.

ఈ సంఘటన రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకుందని, వారికి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అన్నారు. కాగా, మరోవైపు చమురు నిల్వలు పూర్తి కావడంతో ఇంధన శుద్ధి కార్మగారాన్ని మూసివేసినట్లుగా పెట్రోలియం జనరల్ ఉద్యోగులు యూనియన్ తెలిపింది. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు గ్యాస్ ధరలు కూడా పెరగడంతో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు కిరోసిన్ వైపు మొగ్గుచూపుతున్నారని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story