Recharge: రీఛార్జ్ చేయకపోతే సిమ్ ఎన్ని రోజుల్లో డి-యాక్టివేట్ అవుతుంది.. యాక్టివేట్ కావడానికి ఏం చేయాలి?

by Anjali |   ( Updated:2024-11-12 10:12:47.0  )
Recharge: రీఛార్జ్ చేయకపోతే సిమ్ ఎన్ని రోజుల్లో డి-యాక్టివేట్ అవుతుంది.. యాక్టివేట్ కావడానికి ఏం చేయాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రెండు సిమ్ కార్డ్స్(SIM cards) ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది వివిధ అవసరాల కోసం వేరే వేరే నెట్వర్క్‌లకు చెందినవి నాలుగు ఫోన్ నెంబర్లు కూడా యూజ్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. కాగా ఒక సిమ్‌కు సిగ్నల్ రాకపోయినా వేరే నెట్వర్క్ కు సంబంధించిన సిమ్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు రీఛార్జ్ రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.

కాగా చాలా మంది ఇలా రీఛార్జ్(Recharge) ధరలు పెరిగాయని.. సిగ్నల్స్ రావట్లేదని బ్యాలన్స్ వేసుకోకుండా ఉంటారు. దీంతో కొన్ని రోజుల తర్వాత టెలికాం సంస్థ(A telecom company) ఆ సిమ్‌ను మరొకరికి కేటాయిస్తుంది. ఇలా రీఛార్జ్ చేసుకోకపోతే ఎన్ని రోజుల వరకు సిమ్ వాడొచ్చు. ఎక్స్‌పైరీ డేట్ తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మిగతా నెంబర్లు ఉన్నాయి కదా..? ఇన్ కమింగ్ కాల్స్ వస్తున్నాయి కదా? అవుట్ గోయింగ్ సేవలు ఎందుకని అనుకునే వారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్-ఐడియా పలు టెలికాం కంపెనీలు కామన్‌గా నెల రోజుల తర్వాత అవుట్ గోయింగ్ సేవలు నిలిపివేస్తాయి. అలాగే 90 రోజుల వరకు ఇన్ కమింగ్ సేవలను అందుబాటులో ఉంచుతారు. తర్వాత రీచార్జ్ చేయకపోతే పూర్తిగా డి-యాక్టివేట్(De-activate) చేసేస్తారు.

ఇలా విధంగా సిమ్ డి-యాక్టివేట్(De-activate) అయ్యాక.. చాలా మంది బాధపడుతుంటారు. నెంబర్ కలిసొచ్చిందనో, చాలా మంది ఫోన్ నెంబర్లు అందులోనే ఉన్నాయనో, ఫ్యాన్సీ నెంబరనో.. ఇలా చాలా కారణాలతో సిమ్ ను మిస్ చేసుకోవడాకి ఇష్టపడరు. డి-యాక్టివేట్ అయ్యాక కూడా ఒకవేళ అదే సిమ్ కావాలని అనుకుంటే.. ఆ సేవను పునరుద్ధరించడానికి 6 నుంచి 9 నెలల వరకు టైం పడుతుంది. అందుకోసం మీ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించాలి. కేవైసీ డాక్యుమెంట్ల(KYC documents)తో కూడిన వేరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ కు రీఛార్జ్ చేసుకున్నాక మళ్లీ యాక్టివేట్(Activate) అవుతుంది.

Advertisement

Next Story