- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు మద్దతుగా శక్తివంతమైన దేశం: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు శక్తివంతమైన దేశం అండగా ఉందని అన్నారు. శుక్రవారం ఇస్లామాబాద్ భద్రత చర్చలో మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్ తన గరిష్ట సామర్థ్యాన్ని చేరుకోలేక పోవడానికి కారణం ఇతర శక్తివంతమైన దేశాల పై ఆధారపడటమేనని తెలిపారు. 'ఒక దేశం ఎలాంటి స్వతంత్ర విదేశాంగ పాలసీలు లేకుండా ప్రజల ఆసక్తులకు ఎలాంటి భద్రత ఇవ్వలేదు' అని అన్నారు. ఒక శక్తివంతమైన దేశం తాజాగా తన రష్యా పర్యటన పై అభ్యంతరం వ్యక్తం చేసిందని అమెరికాపై విమర్శలు చేశారు. అయితే మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు మిత్రదేశం భారత్‌కు మాత్రం మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతకుముందు రోజు ఇమ్రాన్ ఖాన్ పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. ఇమ్రాన్ ను గద్దె దింపేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని అధికారి కేట్ బెడింగ్ ఫీల్డ్ తెలిపారు. పాక్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.