కోర్టులో కేసు ఓడిపోయిన ప్రధాని.. దాన్ని ఎదుర్కోక తప్పదు..

by Javid Pasha |
కోర్టులో కేసు ఓడిపోయిన ప్రధాని.. దాన్ని ఎదుర్కోక తప్పదు..
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ రాజకీయాలు ప్రపంచ హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రధానిని గద్దె దించేందుకు ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ వారు తెగ శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. ప్రధాని వ్యతిరేక నేతలంతా చర్చలు జరిపి ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానంలో కేసు కూడా నమోదైంది. దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఇంతలో అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరో 90 రోజుల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు.

అయితే అవిశ్వాస తీర్మానంపై కోర్టులో నడుస్తున్న కేసును తాజాగా ఇమ్రాన్ ఓడిపోయాడు. దీంతో అతడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోక తప్పదని సుప్రీం తీర్పిచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన సమావేశానికి ఏప్రిల్ 9న పిలునివ్వాలని స్పీకర్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed