- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహకార సంఘాలకు శుభవార్త.. త్వరలోనే నూతన HR పాలసీ
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం త్వరలోనే సహకార సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. సంఘాల్లోని ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అధ్యయనం చేసి నివేదికను సైతం ప్రభుత్వానికి అందజేసింది. అదే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లకు ఆయా సహకార సంఘాల ఆదాయాలను బట్టి గౌరవ వేతనాలు పెరగనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 2019లో టెస్కాబ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో టెస్కాబ్ చైర్మన్, నాబార్డు సీజీఎం, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్, సీసీ ఆర్ సీ ఎస్, ఎండీ టెస్కాబ్, ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులను సభ్యులుగా చేర్చారు. పీఏసీఎస్‌లపై కమిటీ అధ్యయనం చేసింది. ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. అయితే విధానపరమైన లోపాలతో నేటివరకు ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు, వేతనాల పెంపు జరుగలేదు. దీంతో తీవ్రంగా సహకార సంఘం ఉద్యోగులు నష్టపోయారు. అయితే కొంత అసంతృప్తి ఉండటంతో ఇది సహకారసంఘం బలోపేతంపై ప్రభుత్వం చూపుతుందని భావించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విధానాల అమలు, సమీక్షకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా అందరికీ ఒకే రకమైన పద్ధతులు, నిబంధనలు వర్తించేలా కమిటీ నివేదికలో పేర్కొంది.
మూడేళ్ల వరకు రుణాలు..
ఆర్థికంగా బలంగా లేని సంఘాలకు అపెక్స్ బ్యాంక్, డీసీసీబీల నుంచి మూడేళ్ల వరకు రుణాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సహకార సంఘాల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి గౌరవ వేతనాలు రూ.7500 నుండి 15 వేల వరకు పెంచాలని కమిటీ ప్రతిపాదన చేసింది. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘాల చైర్మన్లకు రూ.7,500, రూ.5 నుంచి రూ.10 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘాల చైర్మన్లకు రూ.10 వేలు, రూ.10 నుంచి రూ.15 కోట్ల టర్నోవర్ ఉన్న సహకార సంఘాల చైర్మన్లకు రూ.15 వేలు గౌరవ వేతనాలకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తెలిపితే సహకార సంఘం ఉద్యోగులకు సైతం పీఆర్సీ పెరగడంతో పీఏసీఎస్ లో మరింత బలోపేతం కానున్నాయి.