Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.. బ్రిటిషూ పాత్రలో స్టార్ హీరో

by Hamsa |
Sai Dharam Tej:  ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.. బ్రిటిషూ పాత్రలో స్టార్ హీరో
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ కారణం కొద్ది రోజులు సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. మళ్లీ ‘బ్రో’మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. చివరగా ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఏడాదిపాటు కాళీగా ఉన్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala yeti gattu)

. దీనిని రోహిత్ కెపి(Rohit KP) తెరకెక్కిస్తుండగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్(Prime Show Entertainments) బ్యానర్‌పై ‘హనుమాన్’ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 18వ చిత్రంగా రాబోతున్న ‘సంబరాల ఏటిగట్టు’లో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 25వ తేదీన పాన్ ఇండియా రేంజ్ విడుదల కాబోతుంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. మూవీ మేకర్స్ అప్డేట్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’సినిమా నుంచి అప్డేట్ విడుదల చేశారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ (Srikanth)పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో పెట్టాడు. ఇందులో ఆయన బ్రిటిషూ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్‌లో శ్రీకాంత్ గుబురు గడ్డంతో ఓ గుహలో కూర్యొని ఏదో పరికరాన్ని పట్టుకుని కోపంగా చూస్తూ గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ఈ పవర ఫుల్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.

Next Story

Most Viewed