గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత

by Mahesh |
గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణ భారతి (92) కన్ను మూశారు. స్నేహపురి కాలనీలోని స్వగృహంలో ఆమె తన తుదిశ్వాస విడిచారు. ఆమె ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మీ దంపతుల రెండో కుమార్తె. ఆమె తన సంపాదనలో అత్యధికంగా పలు విద్యాసంస్థలకు ఆర్ధిక సాయంగా విరాళాలు ఇచ్చింది. ఆమె దళితుల విద్యావ్యాప్తికి పసల కృష్ణ భారతి ఎంతో కృషి చేశారు. అలాగే గోశాలల నిర్వాహణకు విరాళాలు సమకూర్చారు. కాగా 2022 జులైలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చినప్పుడు.. పసల కృష్ణ భారతిని సత్కరించారు. అలాగే ఆమెకు పాదాభివందనం చేసిన ప్రధాని మోడీ ఆశీస్సులు తీసుకున్నారు.

స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ (Bhimavaram Sub-Collector) ఆఫీసుపై భారత జెండా ఎగురవేసిన ఘటనలో 1932 జూన్‌లో కృష్ణమూర్తి దంపతులను అరెస్ట్ చేసిన అధికారులు.. కఠిన కారాగార శిక్ష విధించారు. కాగా జైలు శిక్ష పడిన సమయానికి అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి గా ఉన్నప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వం కనీసం కనికరించలేదు. జైలులోనే ఆమెకు కృష్ణ భారతి (Krishna Bharati) జన్మించారు. కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణ పర్మమాత్ముడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ ఆమెకు కృష్ణ భారతి అని పేరు పెట్టారు. ఆమె తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. పశ్చిమ విప్పర్రు గ్రామంలోని తమ యావదాస్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు.

Next Story

Most Viewed