మేడిపల్లి - మోహన్ రావు పేట రహదారి పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..

by Sumithra |
మేడిపల్లి - మోహన్ రావు పేట రహదారి పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..
X

దిశ, మేడిపల్లి : లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడిపి క్యాంటర్ వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడిన సంఘటన మేడిపల్లి - మోహన్ రావు పేట ప్రధాన రహదారి పై జరిగింది. వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం తెల్లవారుజామున కోరుట్ల నుంచి జగిత్యాలకు కర్బుజా లోడుతో వెళుతున్న క్యాంటర్, వరంగల్ నుండి మిర్చి లోడుతో వస్తున్న లారీ ఢీ కొన్నాయి.

ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.. విషయం తెలుసుకున్న మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. బోల్తాపడ్డ లారీని క్రేన్ సహాయంతో తొలగించి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూశారు. వెనువెంటనే స్పందించిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసిన ఎస్ఐ శ్యామ్ రాజు ను ప్రయాణికులు అభినందించారు. విషయం తెలుసుకున్న కోరుట్ల లారీ అసోసియోషన్ అధ్యక్షుడు మహ్మద్ అన్వర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.

Next Story

Most Viewed