Samantha: ప్రేమ అందే చోట ఉంటే రోజూ పండగే.. సమంత పోస్ట్ ఎవరి గురించంటే?

by Hamsa |   ( Updated:2024-11-01 15:34:33.0  )
Samantha: ప్రేమ అందే చోట ఉంటే రోజూ పండగే.. సమంత పోస్ట్ ఎవరి గురించంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ‘ఖుషి’ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే మయోసైటీస్ బారిన పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఇటీవల సామ్ ఓ పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతోంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తుంది. అయితే సమంత నటించిన మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) నంవబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమంత వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా, దీపావళి పండుగను ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ‘‘మనకు మనశ్శాంతిని ఇచ్చి, పర్సనల్‌గా మెరుగుపరిచి, ప్రేమ, గౌరవం అందే చోట ఉంటే రోజూ పండగలాగా ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే సామ్ ప్రేమ గురించి పెట్టడంతో ఎవరి గురించి చేసిందోనని అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ రాజస్థాన్‌(Rajasthan)లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్(Six Senses Fort) బర్వరాకు వెళ్లిన సామ్ దీపాలు వెలిగిస్తూ దేవుడికి పూజ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత క్రిష్టియన్ అయినా కూడా హిందూ మతాన్ని నమ్ముతూ దేవాలయాలకు వెళ్తూ పూజలు చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read More : పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత.. అన్నింటికి మించింది ప్రేమంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Advertisement

Next Story