నెలలో 15 రోజులు ఆ వ్యాధితోనే ఇబ్బంది పడ్డాను.. స్టార్ సింగర్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-23 07:30:56.0  )
నెలలో 15 రోజులు ఆ వ్యాధితోనే ఇబ్బంది పడ్డాను.. స్టార్ సింగర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను పీఎండీడీ అనే వ్యాధితో బాధపడ్డాను. ఇప్పుడిప్పుడే దీని నుంచి కోలుకుంటున్నాను. అయితే నెలలో 15 రోజులు దీనితోనే బాధపడేదాన్ని. ఇలా ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీని వల్ల అతిగా తినడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే 10 కిలోల బరువు కూడా పెరిగా. చివరకు యోగా, ఫిజియోథెరపీతో వ్యాధిని నయం చేసుకున్నా’ అంటూ నేహా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ మూవీలోని స్వింగ్ జర అనే సాంగ్‌ను నేహానే పాడారు. ఇక ఈ పాటకు తమన్నా తన డ్యాన్స్‌తో ఫిదా అనిపించారు.

Advertisement

Next Story

Most Viewed