ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా.. కానీ నా ఫేవరేట్ అయిపోయింది.. డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా.. కానీ నా ఫేవరేట్ అయిపోయింది.. డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఎన్నో అద్భుతమైన పాటల్ని రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈ టీవీ ఛానల్ ‘నా ఉఛ్వాసం కవనం’ అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ పార్ట్ 1‌ను ఈటీవీ విన్ యాప్‌లో రిలీజ్ చేసారు. ఇందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి‌తో ప్రభాస్‌కి ఉన్న అనుబంధం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. “నాకు ఈశ్వర్ సమయంలో లిరిక్స్ గురించి అంత అవగాహన లేదు. నా ఫస్ట్ మూవీలో సాంగ్స్ కూడా కూడా సిరివెన్నెల గారు రాశారని విన్నాను కానీ ఆయన్ని కలవలేదు. మొదటిసారి ఆయన్ని వర్షం సినిమా సమయంలో కలిశాను. అప్పుడే లిరిక్స్, వాటి అర్దాల గురించి తెలిసింది. నిర్మాత MS రాజు గారి ఆఫీస్‌లో సీతారామశాస్త్రి గారిని మొదటిసారి కలిసాను. ఆయన రాసిన పాట తన బేస్ వాయిస్‌తో ‘మెల్లగా కరగని..’ అని వినిపించారు. దాంతో ఈ సాంగ్ పోయినట్టే, ఈ పాట ఏదో తేడాగా ఉందని అనుకున్నాను. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, నేను కలిసి ఈ వర్షం సాక్షిగా ప్లేస్‌లో ఐ లవ్ యు శైలజ అనే లిరిక్ పెట్టాము. కానీ చివరకు సిరివెన్నెల గారు రాసింది రికార్డ్ అయ్యాక విన్నాము. ఆ తర్వాత మెల్లగా కరగని.. సాంగ్ నా ఫేవరేట్ సాంగ్ అయిపోయింది అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డార్లింగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏపీసోడ్‌ను చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఈటీవీ విన్‌ యాప్‌లో చూడోచ్చు.

Advertisement

Next Story

Most Viewed