- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
WhatsApp: వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్యకు చెక్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్(Instant Messaging App) వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే బ్రౌజర్లోకి వెళ్లాల్సిన పని లేకుండా వాట్సాప్‌లోనే ఇమేజెస్(Images)ను సెర్చ్ చేసే సదుపాయం తీసుకొచ్చిన ఈ యాప్ తాజాగా మరో కొత్త ఫీచర్(New Feature)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్(Voice Message Transcripts)' పేరుతో దీన్ని విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో అవతలి వ్యక్తులు పంపిన వాయిస్ చాట్(Voice Chat)ను యూజర్లు టెక్స్ట్(Text) రూపంలో చదువుకోవచ్చు. దీంతో నలుగురిలో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్(Earphones) అవసరం లేకుండా ఈ వాయిస్ మెసేజ్ ను రీడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కేవలం మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే ఈ టెక్స్ట్ ను చూడగలరని, వాయిస్ మెసేజ్ సెండ్ చేసిన వారు దీన్ని వినియోగించలేరని వాట్సాప్ తెలిపింది.
కాగా ఈ ఫీచర్ ను ఎనేబుల్(Enable) చేసుకోవాలంటే యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్(WhatsApp Settings)లోకి వెళ్లి చాట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ ఆన్/ ఆఫ్(ON/OFF) చేసుకోవడంతో పాటు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆండ్రాయడ్ యూజర్లకు ఇంగ్లీష్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలలో, ఐఓఎస్ యూజర్లకు ఎక్సట్రాగా అరబిక్, ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్, జర్మన్, జాపనీస్ లాంగ్వేజ్ లలో మాత్రమే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా త్వరలోనే దీన్ని అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ వెల్లడించింది.