Keerthy Suresh: ‘బేబీ జాన్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన కీర్తి సురేష్

by Hamsa |   ( Updated:2024-11-23 12:45:20.0  )
Keerthy Suresh: ‘బేబీ జాన్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన కీర్తి సురేష్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘బేబీ జాన్’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కలీస్ (Kalis)తెరకెక్కిస్తున్నారు. అయితే దీనిని 1 స్టూడియోస్, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రియా అట్లీ, మురాద్, ఖేతానీ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కామియో రోల్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై హైప్ పెంచుతున్నారు. తాజాగా, బేబీ జాన్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘నయన్ మటక్కా’ ప్రొమోను విడుదల చేశారు. అయితే దిల్జిత్ దోశాంజ్(Diljit Dosanjh), దీక్షితా వెంకటేశన్ పాడిన ఈ పాట ఫుల్ వీడియో నవంబర్ 25న రానున్నట్లు కీర్తి సురేష్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా వరుణ్ ధావన్(Varun Dhawan) కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.


Read More...

కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. మ్యారేజ్ అక్కడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ తండ్రి..?


Click Here For Twitter Post..

Advertisement

Next Story