ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

by Sridhar Babu |
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
X

దిశ, కారేపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి పిలుపు నిచ్చారు. శుక్రవారం కారేపల్లి మండలం వెళ్తు మండలంలోని తాళ్ల గూడెం గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య నివాస గృహం వద్ద ఆగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేణుక చౌదరి మాట్లాడుతూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటివరకు ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, వారి మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

అనంతరం మహిళలు రేణుక చౌదరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మానుకొండ రాధా కిషోర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లమోతు లక్ష్మయ్య, కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ గుజ్జర్లపూడి రాంబాబు, మాజీ సర్పంచులు సునీత, రాందాస్, అర్జున్, ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అజ్మీర సుశీల బాయి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవండ్ల నాగేశ్వరరావు, దొడ్ల వేణు, నల్లమోతు వెంకట నరసయ్య, మాలోత్ ప్రేమ్ కుమార్, శ్రీరాములు, బత్తుల ఉపేందర్, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed