Career and Skills : ఒక్కసారి వదులుకుంటే అంతే..! తిరిగి ఉద్యోగం సంపాదించడం కష్టమే!!

by Javid Pasha |   ( Updated:2024-11-22 15:37:10.0  )
Career and Skills : ఒక్కసారి వదులుకుంటే అంతే..! తిరిగి ఉద్యోగం సంపాదించడం కష్టమే!!
X

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత సమస్యలో, వర్క్ ప్లేస్ నచ్చకనో కొందరు ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే మానేస్తుంటారు. మరి కొందరు ఆసక్తి లేక వదులుకుంటారు. ఇంకొందరు ఎక్కడా కుదురుగా ఉండరు. అయితే ఆర్థిక స్థిరత్వం ఉన్నవారికి, కొంతకాలం జాబ్ లేకున్నా నడుస్తది అనుకునే వారికి దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఉద్యోగమే ఆధారంగా జీవించాలనుకునే యువత మాత్రం ఇలాంటి పరిస్థితివల్ల నష్టపోతోంది. మొదటి చేస్తున్న జాబ్ మానేశాక కొంత కాలం గ్యాప్ తర్వాత, కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

కారణాలివే..

ఒక వ్యక్తి వచ్చిన అవకాశాన్ని గానీ, ఉద్యోగాన్ని గానీ ఎందుకు వదులుకుంటారు? అన్నప్పుడు ప్రామాణీకరించిన కారణాలేవీ ఉండవు. సదరు వ్యక్తుల ఆసక్తులు, నైపుణ్యాలు, లక్ష్యాలు, అవసరాలు, వర్క్ ప్లేస్ వెదర్, సాలరీ వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పర్సనల్ స్కిల్స్ కెరీర్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు అంటున్నారు. అయితే ఇలా వదులుకుంటున్న వారిలో స్త్రీ, పురుషులు ఉంటున్నప్పటికీ, ఎక్కువ శాతం స్త్రీలే ఉంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. చదవు పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరిన కొంత కాలానికి, పెళ్లి ఫిక్స్ అవడం, కుటుంబంలో అనారోగ్య సమ్యలు, బాధ్యతలు వంటి కారణాలతో యువతీ యువకులు ఉద్యోగాలు మానేస్తున్నారు. ఇక మహిళల్లో అత్యధిక మంది గర్భధారణ తర్వాత ప్రసూతి కోసం ఉద్యోగాలు మానేస్తున్న వారి జాబితాలో ఉంటున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌ కష్టమే..

ప్రస్తుతం ఇండియాలో 35 ఏండ్లలోపు వారిలో 18 శాతం మంది ఉన్న ఉద్యోగాన్ని వదలుకొని, కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఒక్కసారి జాబ్ వదులుకున్న తర్వాత కెరీర్‌ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించడంలో మాత్రం చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. మొదట ఏదో ఒక కారణంతో జాబ్ మానేసి, కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ పాత సంస్థలోనే ఉద్యోగ ప్రయత్నం చేసేవారిలో చాలా మంది విఫలం అవుతున్నారు. ఇక మొదట జాబ్ చేసిన సంస్థలో కాకుండా, మరో సంస్థలో ప్రయత్నించినా అప్పుడున్న పోటీ పరిస్థితుల్లో సాలరీ, వర్క్ స్టైల్, ఫెసిలిటీస్ వంటి అంశాల్లో ప్రతికూలతలే ఎదురవుతున్నాయని, దీని కారణంగా కొందరు వెనుకడుగు వేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

వైఫల్యానికి కారణం?

కారణాలేమైనా కెరీర్ గ్యాప్ పలు సవాళ్లను కలిగి ఉంటోంది. దీంతో కెరీర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడంలో స్త్రీ, పురుషులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. రెండవసారి ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతున్నారు. నచ్చిన ఉద్యోగం రాకనో, వచ్చే సాలరీ సరిపోకనో, వర్క్ స్టైల్ నచ్చకనో, అసలు తమలోనే అప్పటి పరిస్థితులకు తగిన నైపుణ్యం లేకనో రెండవసారి ఉద్యోగ ప్రయత్నంలో చాలా మంది విఫలం అవుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అనుకుంటున్నారా? ప్రయత్నిస్తే తప్పక ఉంటుంది అంటున్నారు నిపుణులు.

పరిష్కారం ఏమిటి?

వ్యక్తిగత అవసరాల కోసం ఉద్యోగం మానేసిన తర్వాత జాబ్ మార్కెట్లో చాలా మార్పులు రావచ్చు. కాబట్టి మీరు మీరు కెరీర్‌ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే అప్పటి పరిస్థితులకు తగిన నైపుణ్యాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. లేకపోతే అలవర్చుకొని ప్రయత్నించడంవల్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే గ్యాప్ తర్వాత వెంటనే కోరుకున్న ఉద్యోగం రావాలనుకుంటే కష్టమే. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉద్యోగం మీ ప్రధాన జీవనాధారమనుకుంటే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఆ తర్వాత మీరు కోరుకున్న మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. అప్పటి దాకా మీరు చేస్తున్న ఉద్యోగం వల్ల తగిన అనుభవం, అప్పటి అవసరాలకు తగిన నైపుణ్యాలు కూడా అలవడుతాయి.

Read More...

జీవితంలో మీరు సంతోషంగా ఉండాలా..? ఈ రెండు విషయాలు తప్పక గుర్తుంచుకోండి!




Advertisement

Next Story

Most Viewed