- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajasthan : చనిపోయి బతికొచ్చి.. మళ్లీ కొన్ని గంటలకే! రాజస్థాన్‌లో విచిత్ర ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని జున్‌జున్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుది. చనిపోయాడని ప్రకటించిన డాక్టర్లు.. వ్యక్తి దహన సంస్కారాలకు ముందే కళ్లు తెరిచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల చెవిటి, మూగ వ్యక్తి కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం జున్‌జున్‌లోని బీడీకే హాస్పిటల్‌కి తీసుకెళ్లనట్లు పోలీసు నివేదకలు సూచిస్తున్నాయి. కుమార్ చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రి వైద్యులు మధ్యాహ్నం 2 గంటలకు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసి బాడిని శ్మశానవాటికకు తరలించారు.
మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కుమార్ ఒక్కసారి కళ్ళు తెరిచి శ్వాస తీసుకుంటున్నారు. ఇది గమనించిన వ్యక్తులు వెంటనే అంబులెన్స్‌లో తిరిగి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటున్న కొన్ని గంటలకే మళ్లీ యువకుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రమావతార్ మీనా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణలో వైద్యుల నిర్లక్ష్యం గుర్తించారు. గురువారం రాత్రి డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్‌లను సస్పెండ్ చేశారు.