నాకు ఆ ముద్దులు బాగా నచ్చాయి.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-25 15:11:42.0  )
నాకు ఆ ముద్దులు బాగా నచ్చాయి.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ డమ్ అందుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీకి.. హిట్స్ కంటే ఎక్కువ ప్లాప్సే ఎదురవ్వడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం చదువులపై ఇంట్రెస్ట్ పెట్టింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఫారిన్‌లో నేచర్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో పాటు వీడియోను కూడా పెట్టింది. అంతేకాక దానికి ‘ఆకాశం రంగు నుంచి వచ్చిన ముద్దులు నాకు నచ్చాయి’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

(video link credits to sreeleela instagram id)

Advertisement

Next Story