హైదరాబాద్ పోలీస్ వినూత్న నిర్ణయం.. ఇక ఆకతాయిల ఆగడాలకు చెక్!

by Javid Pasha |
హైదరాబాద్ పోలీస్ వినూత్న నిర్ణయం.. ఇక ఆకతాయిల ఆగడాలకు చెక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతి సామాన్యుడికి సమన్యాయం చేసేందుకు వీలుగా ఫ్రెండ్లీ పోలిసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడేవారు. ఈ క్రమంలో పోలీసులకు బాధితుడికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఏ వర్గానికి చెందిన వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వీలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు మరో ముందడుగు వేశారు. నగరంలో ఆకతాయిల ఆగడాలను కట్టడిచేసి మహిళలకు భద్రత కల్పించేందుకు, ఇతర గొడవలను అరికట్టేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు, నగరవాసుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. 9490616555 నెంబర్‌కు ఏదైనా సమస్యను, ఇతర సూచనలను వాట్సాప్ చేయడం ద్వారా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అయితే, వాట్సాప్ చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సిటీ పోలీసులు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed