గవర్నర్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తోంది.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

by Vinod kumar |
గవర్నర్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తోంది.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన నిరసన బైక్ ర్యాలీలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో రూల్ పెడుతుందని హర్యానా, పంజాబ్ ఒక రూల్.. అయితే తెలంగాణ రాష్ట్రానికి మరో రూలా..! అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రైతుల్లో మొత్తంగా నల్లజెండాలు ధరించి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

దేశంలో ఉన్న రైతన్న అంతా కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలను కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో రూల్ ప్రవేశపెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకారుకు యాభై లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రైతుల సంపాదన పది రెట్లు పెరిగిందని అన్నారు. గతంలో ఎకరం భూమి నాలుగు, ఐదు లక్షలు ఉంటే నేడు దానికి పది రెట్లు పెరిగిందన్నారు.


దేశంలో కేసీఆర్ అభిమానం పెరుగుతుండడంతో తట్టుకోలేని కేంద్ర బీజేపీ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేయడానికి లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఎదురు తిరిగిన రాష్ట్రాలపై సీబీఐ, ఈడీ దాడులు నిర్వహిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో పార్టీలో పని చేసిన వారిని గవర్నర్‌గా ఉండటం వల్ల చెడ్డపేరు వస్తుందని నీతి వాక్యాలు చెప్పిన మోదీ, ఈ రోజు ఓ రాష్ట్రానికి అధ్యక్షుడు పనిచేసి.. ఎన్నికల్లో గెలవానోళ్లలో రాష్ట్రానికి గవర్నర్‌గా ఎలా నియమించరని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ను ఉద్దేశించి మాట్లాడారు. గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆమె మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. తాను తలచుకొంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్రాన్ని రద్దుచేసే దమ్ము ధైర్యం లేదన్నారు.


ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకొని రెండు సార్లు గెలిపించారని అలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా, గవర్నర్ హోదాను మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలా మాట్లాడితే తెలంగాణ ప్రజల్లో ఒక్కరోజు కూడా రాష్ట్రంలో తిరగనియమ్మన్నారు. హిట్లర్ తరహాలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాలను ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు. గుజరాత్ కంపెనీలకే దేశాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు.

కేంద్రం మెడలు వంచి ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, చల్లా శ్రీలత రెడ్డి, జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ యశోధరాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూల సైదులు, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్య సొసైటీ చైర్మన్ పేరబోయిన వీరయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేష్ బాబు, అధికార ప్రతినిధి చంద్రయ్య, మహిళా మండల, పట్టణ అధ్యక్షురాలు సావిత్రి, కట్టా కళావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed