అక్కినేని వారసుడికి బాలీవుడ్ ఆఫర్.. ఇకనైనా లక్కు చిక్కేనా!

by Mahesh |   ( Updated:2022-03-08 08:48:11.0  )
అక్కినేని వారసుడికి బాలీవుడ్ ఆఫర్.. ఇకనైనా లక్కు చిక్కేనా!
X

దిశ, సినిమా : అక్కినేని వారసుడు అఖిల్ వరుస సినిమాలు చేస్తున్నా.. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్ అయినప్పటికీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి‌తో 'ఏజెంట్' సినిమా చేస్తున్న అఖిల్‌కు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ నిర్మాతల్లో ఒకరైన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. ఈ చిత్రం పూర్తవగానే అఖిల్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కు హిందీ దర్శకుడినే ఎంచుకున్న కరణ్.. అఖిల్‌కు జోడిగా బీటౌన్ బ్యూటీల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story