డైరెక్ట్‌గా బాయ్‌ఫ్రెండ్ ఇంటికే వెళ్లిన నటి.. షాక్‌లో హీరో ఫ్యామిలీ

by Disha News Desk |
డైరెక్ట్‌గా బాయ్‌ఫ్రెండ్ ఇంటికే వెళ్లిన నటి.. షాక్‌లో హీరో ఫ్యామిలీ
X

దిశ, సినిమా : హృతిక్‌ రోషన్‌- సబా ఆజాద్ ప్రేమలో ఉన్నారంటూ కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌కు బలం చేకూర్చేలా తరచూ డిన్నర్‌, లంచ్‌ డేట్‌కు వెళ్తున్న ఈ జోడీ.. మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సబా ఆజాద్ ఏకంగా హృతిక్‌ రోషన్ ఇంటికే వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ విషయాన్ని హృతిక్ అంకుల్ రాజేశ్‌ రోషన్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. 'సంతోషం ఎల్లప్పుడూ మా చుట్టే ఉంటుంది. ఈ ఆదివారం మధ్యాహ్న భోజన సమయంలో ఇంకాస్త రెట్టింపు అయింది' అంటూ ఫ్యామిలీతో సబా దిగిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన హృతిక్.. 'అవును చాచా.. నిజమే! మీరు భలే కామెడీ చేస్తారు' అని బదులిచ్చాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌పై 'దేవుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు' అంటూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed