Yoga: కపోతాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

by Manoj |   ( Updated:2022-04-05 06:53:32.0  )
Yoga: కపోతాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
X

కపోతాసనం: Yoga| మొదటగా వజ్రాసనంలో కూర్చొని కుడికాలును కొద్దిగా ముందుకు జరపాలి. ఆ తర్వాత రెండు చేతులను కుడికాలు ముందు భాగంలో భూమిపై ఆన్చాలి. ఇప్పుడు ఎడమకాలును పూర్తిగా వెనక్కి చాపాలి. గాలి పీల్చుకుంటూ తల పైకి ఎత్తాలి. ఇలా ఎత్తినప్పుడు ధ్యాస వెన్నెముకపై కేంద్రీకరించాలి. ఇప్పుడు గాలి వదిలేస్తూ చేతులతో బ్యాలెన్స్ చేస్తూ తలను భూమి మీద ఆన్చాలి. తిరిగి గాలి పీలుస్తూ తల పైకి తీసుకురావాలి. ఇలా పది సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ కాలును ముందుకు, కుడికాలును వెనక్కి చాచి కూడా చేయాలి.

ఉపయోగాలు :

* నడుము భాగానికి మంచి వ్యాయామం

* కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.

* శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

* మూత్రపిండాలు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.



Advertisement

Next Story

Most Viewed