కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

by Javid Pasha |   ( Updated:2023-05-19 07:38:50.0  )
కన్యారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
X

ఉత్తర ఫల్గుని 2,3,4 (టో, పా, పీ) హస్త 1,2,3,4 ( పూ, షం, ణా, ఠా )- చిత్త 1,2 (పే,పో)

ఆదాయం-11,

వ్యయం -5,

రాజపూజ్యం-4,

అవమానం-5

ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు షష్టమ స్థానములో 13.04.2022 వరకు రజతమూర్తిగాను తదుపరి సప్తమమున లోహమూర్తిగా ఉండును. శని వత్సరాది నుంచి 29.04.2022 వరకు పంచమములో రజతమూర్తిగాను, తదుపరి 12.07.2022 వరకు షష్ఠములో తామ్రమూర్తిగాను, అప్పటి నుండి 17.01.20223 వరకు మరల పంచమమున లోహమూర్తిగాను, సంవత్సరాంతములో షష్టమమందు తాప్రమూర్తియై గోచరించును. రాహువు అష్టమములో ద్వితీయమందు కేతువులు లోహమూర్తులుగా సంచరించును. సూచనలు పాటిస్తారు. ఊహించని అతిథుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రాంతాలలోని మీ శ్రేయోభిలాషుల నుంచి ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబంలో ఐక్యత మీ ఆనందానికి, పురోభివృద్ధికి కారణం అవుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార పరంగా స్వల్పమైన మార్పులు చేయగలిగితే అధిక లాభాలను సాధించవచ్చునని శ్రేయోభిలాషులు మీకు సలహాలనిస్తారు. సంతానం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ధనాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. మీకు ఇష్టంలేని వ్యక్తులతో చర్చలు జరుపవలసి వస్తుంది. మానసిక సంఘర్షణకు తావు ఇవ్వకండి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ గంటలు, గంటలుగా ఆలోచించే విధానానికి స్వస్తి చెబుతారు. ఒక పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భావిస్తారు.

నిత్యం వ్యవసాయదారులకి ఖర్చులు ఎక్కువ ఖర్చులకు తగిన దిగుబడి రావచ్చు. వ్యవసాయదారులకు వ్యవసాయంలో కొత్త పద్ధతులు అవలంభించాలని ఆరటం పెరుగుతుంది. విద్యార్థులు ఉద్యోగస్తులు తాము అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి కనబడుతున్నది. శ్రమికులు, తమ కష్టానికి తగిన ప్రతిఫలము దక్కినను అంతకు మించి ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కర పాద భాదలు. ఎముకల సంబంధించిన సమస్యలు. శిరోవేదన ఉండవచ్చు. తలసి మరియు బిల్వవృక్షని నాటి పెంచి పోషించండి. శనిధ్యానం, బృహస్పతి ధ్యానము, రామధ్యానము నిత్యము చేయండి. పేద గర్భిని స్త్రీలకు చేతనైన సహాయం చేయండి. పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి.

మీకంటూ ఒక వర్గాన్ని స్థిరపరుచుకుంటారు. నూతన భవన నిర్మాణానికి బ్యాంక్ బుుణాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతుంది. శక్తికి మించిన కార్యాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. పేరు ప్రతిష్టలకు లోపం ఉండదు. దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం పరిపూర్ణంగా ఉంది. ప్రతిష్టలకు లోటు ఉండదు. రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీకు విశేషంగా సహకారం లభించవచ్చును. కండరాలు, కీళ్లనొప్పులు అవస్థలు మాత్రం భరించక తప్పదు.

బీపీ, షుగర్ వంటి వ్యాధుల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ, అజాగ్రత్త పనికిరాదు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సమాజంలో గతంలో నష్టపోయిన పరపతిని ప్రతిష్టను తిరిగి పొందుతారు. ఏవరైతే గతంలో అవమానపరిచారో వారు నిజము తెలుసుకొని పశ్చాత్తాప పడతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆనందముచే చక్కని స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య సౌఖ్యము ఏర్పడుతుంది. గతంలో ఉన్న అపోహలు అనుమానాలు సమసిపోతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతమున్న ఆదాయానికి మరొక్క ఆదాయము తోడవును. తెలివితో చాకచక్యంతో శత్రువులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు

.

సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..



Advertisement

Next Story

Most Viewed